జిసిగాడాం మండలం తెదేపా అధ్యక్షుడిగా కుమరాపు రవి ఎన్నికయ్యారు. రణస్థలంలోని ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది. అద్యక్షుడుగా కుమరాపు రవికుమార్, ప్రధాన కార్యదర్శి కుదిరిల్ల బుజ్జి పేర్లును ఎంపీ ప్రతిపాదించగా డిసిసిబి చైర్మన్ శివాల సూర్యనారాయణ, ఎచ్చెర్ల నియోజకవర్గ పరిశీలకుడు అన్నపు రామకృష్ణ మద్దతు తెలిపారు. తెదేపా మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.