కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భద్రత పెన్షన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు తెలిపారు. సోమవారం లావేరు మండలం గుమ్మడం గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్లు అందజేస్తున్నామని, సంబంధిత సచివాలయ ఉద్యోగుల కృషితోనే ఇది సాధ్యమవుతోందని ఆయన పేర్కొన్నారు.