ఎచ్చెర్ల (మ) కుశాలపురం పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి 16 పై అతివేగంతో వెళ్తున్న ఓ లారీ నియంత్రణ కోల్పోయి బుధవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జయినప్పటికీ, అదృష్టవశాత్తూ లోపల ఉన్న వారికి ఎటువంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న నేషనల్ హైవే సిబ్బంది వెంటనే స్పందించి, క్రేన్ సహాయంతో లారీని తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరించారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు.