రణస్థలం జూనియర్ కళాశాల బాలుర వసతి గృహాన్ని ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం రాత్రి వసతి గృహానికి వెళ్లిన ఆయన విద్యార్థుల సంక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. వార్డెన్ లేకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో తప్పనిసరిగా వార్డెన్ తో పాటు సిబ్బంది కూడా ఉండాలని, కనీసం సిబ్బంది కూడా లేకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు.