ఒరిస్సా రాష్ట్రం నుండి 12 కేజీల 550 గ్రాముల గంజాయిని బస్సులో రవాణా చేస్తున్న అజిత్ కుమార్, గోకుల్ శక్తి అనే ఇద్దరిని శుక్రవారం రాత్రి నరసన్నపేట పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఎం శ్రీనివాసరావు, ఎస్సై బి గణేష్ శనివారం మీడియా సమావేశంలో తెలిపారు.