రణస్థలం: పేకాట శిబిరంపై దాడి.. 9 మంది అరెస్ట్

రణస్థలం మండలం వరిసాం గ్రామం పరిసరాలలో పేకాట శిబిరంపై మంగళవారం రాత్రి టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడి చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నారని ఎస్సై చిరంజీవి తెలిపారు. ముందస్తు సమాచారంతో ఈ దాడి జరిగిందని, ఈ సందర్భంగా 7950 రూపాయల నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, పేకాట ఆడుతున్న 9 మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు అప్పగించామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్