రణస్థలం మండల కేంద్రానికి సర్వేపల్లి రాధాకృష్ణ విద్య కిట్లలో భాగంగా యూనిఫామ్ మెటీరియల్ చేరిందని ఎంఈఓ 2 లావణ్య తెలిపారు. బుధవారం స్థానిక ఎంఆర్సీ కార్యాలయానికి ఇవి చేరుకున్నాయని, పాఠశాలలు తెరిచే సమయానికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వీటిని పంపిణీ చేస్తామని వివరించారు. దీనిపై పాఠశాలల హెచ్ఎంలకు దిశానిర్దేశం చేస్తామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.