శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లోలుగు గ్రామం వద్ద ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశా ఆర్టీసీ బస్సు, లోడుతో ఒడిశాకు వెళ్తున్న మినీ వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్ తీవ్రంగా గాయపడగా వెంటనే శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ వారికి ఎలాంటి హాని జరగపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.