కేంద్ర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కాం మత్స్యకార గ్రామంలో 'మత్స్యసాగర మాల' తొలి దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కోల్ ఇండియా సంస్థ సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో పాల్గొంటారు.