ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో ఏడేళ్ల బాలికపై 55 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాలిక ఆడుకుంటుండగా, నిందితుడు ఆమెను పిలిచి అత్యాచారం చేసినట్లు సమాచారం. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.