ఆమదాలవలస మండలం శైలాడ సచివాలయం వద్ద సోమవారం ఎరువుల బస్తాలను పంపిణీ చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి మెట్ట మోహన్ రావు ఆదివారం తెలిపారు. ఒక ఎకరాకు రెండు యూరియా, ఒక DAP బస్తా ఇస్తామని అన్నారు. కావున ఈ ఎరువుల విక్రయానికి రైతులు ఆధార్ కార్డు, 1బి తీసుకురావాలని కోరారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఎరువుల పంపిణీ జరుగుతుందన్నారు. రైతులు గమనించాలని కోరారు.