సోంపేట మండలంలో ఒకరి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. మండలంలోని పాలవలస గ్రామానికి చెందిన గోకర్ల ఈశ్వరరావు (38) శనివారం గ్రామంలో జరిగిన అమ్మవారి పండగల్లో పాల్గొన్నాడు. రాత్రి అయినా ఇంకా ఈశ్వరరావు ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం స్థానిక జీడి తోటల్లో హత్యకు గురి అయినట్లు స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సీఐ మంగరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.