శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ముత్యాలమ్మపేటలో రిఫ్రిజిరేటర్ పేలిన ఘటన కలకలం రేపింది. అక్కడ ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న డి. లక్ష్మణ్ నాయుడు ఇంట్లో సోమవారం రిఫ్రిజిరేటర్ అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో బీరువా, ఏసీతో పాటు పలు వంట సామగ్రి దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.