ఇచ్చాపురం: మత్స్యకారుల మధ్య ఘర్షణ.. 40 మందికి గాయాలు

ఇచ్చాపురం మండలం డొంకూరు సముద్ర తీర గ్రామంలో నిన్న సాయంత్రం ఇరువర్గాల మత్స్యకారుల మధ్య జరిగిన ఘర్షణలో 40 మంది గాయపడ్డారు. చేపల వేట అనంతరం షెడ్లో డంప్ చేయడమే గొడవకు కారణమని తెలుస్తోంది. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు ఇచ్చాపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించి గ్రామంలో పహారా కాస్తున్నారు.

సంబంధిత పోస్ట్