బుధవారం ఇచ్చాపురం మండలం డొంకూరు, జగన్నాధపురం గ్రామాలలో తుఫాన్ వలన ముంపుకు గురైన ప్రాంతాలను ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు పరిశీలించారు. ముంపునకు గురైన కాజ్ వే, పంట పొలాలను ఆయన పరిశీలించి, రైతులకు నష్టం లేకుండా అన్ని విధాల కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ అధికారులను ఆదేశించి, రైతుల వద్దకు వెళ్లి తగు సలహా సూచనలు అందించాలని సూచించారు. ఈ పర్యటనలో అధికారులు కూడా పాల్గొన్నారు.