గురువారం ఇచ్చాపురంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ బాబు రాజా ముద్రతో ప్రభుత్వం అందిస్తున్న రైతు పాస్ పుస్తకాలను 450 మంది రైతులకు పంపిణీ చేశారు. ఈ పాస్ పుస్తకాలతో రైతులకు భరోసా ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఏమైనా తప్పులు ఉంటే తక్షణమే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు.