కంచిలి: ఖరీఫ్ లో సక్రమంగా ఎరువులు పంపిణీ చేయాలి.. ఎంపీపీ

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎరువుల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని ఎంపీపీ దేవదాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కంచిలి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విత్తనాలు కూడా సకాలంలో అందించాలని సూచించారు. ఖరీఫ్ కు సాగునీరు అందేలా వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు ఎంపీటీసీలు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్