కంచిలి: హైవేపై గోమాంసం తరలిస్తున్న వ్యాన్ బోల్తా

కంచిలి మండలం బూరగం సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై గోమాంసం తరలిస్తున్న వ్యాన్ శనివారం బోల్తా పడింది. ఒడిశా నుంచి సోంపేట మీదుగా వెళ్తుండగా అదుపుతప్పి తిరగబడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్