సోంపేట మండలం పాలవలస గ్రామంలోని శ్రీశ్రీశ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం రెండవ సోమవారం పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి భక్తులు విశిష్ట పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి ఉత్సవ మూర్తులను తిరువీధుల్లో ఊరేగించి, ఆలయ ప్రాంగణంలో సహస్ర దీపారాధన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.