కవిటి: కరపాడు రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

కవిటి మండలం కరపాడు రైల్వే స్టేషన్ వద్ద రూ. 64.79 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేశారు. స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబుతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్