నరసన్నపేట మండలం పెద్ద బొరిగివలస సచివాలయంలో మంగళవారం ఉదయం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన నేరుగా రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ టి సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.