ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులకు మూడు నెలల బకాయిల పింఛన్ సొమ్ములను ఒకేసారి అందించారని ఎమ్మెల్యే అశోక్ అన్నారు. శుక్రవారం కవిటి మండలం రామయ్య పుట్టుగ లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మే నెలలో వృద్ధులకు 7 వేల రూపాయల నగదు పింఛన్లు రూపంలో అందించారు అన్నారు. నిరుపేదలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు.