పలాసలో రోడ్డు ప్రమాదాలు: ముగ్గురికి గాయాలు

శనివారం పలాస మండలం కొబ్బరిఊరు, పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం కోసంగిపురం ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు గాయపడ్డారు. కొబ్బరిఊరు సమీపంలో కుక్క అడ్డుగా రావడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న తల్లి, కుమారుడు కిందపడి గాయపడ్డారు. కోసంగిపురం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒడిశాకు చెందిన యువకుడు గాయపడ్డాడు. క్షతగాత్రులను పలాస ప్రభుత్వ సామాజికాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్