సోంపేట: వర్షాలకే అన్నదాత ఎదురుచూపులు

సోంపేట మండలం పాలవలస గ్రామ పరిధిలో రైతులు వానలు అలస్యం కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి నారు మడులు సిద్ధం చేసుకున్నప్పటికీ వర్షాలు పడకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరి ఆకు మడులు ఎండకు ఎండిపోతుండడంతో రైతులు బోరు నీటితో మడులను తడుపుతున్నారు. సరైనా వర్షాలు పడకపోవడంతో వరి నాట్లు అలస్యం అయ్యేందుకు ఆస్కారం ఉందని రైతన్నలు అంటున్నారు.

సంబంధిత పోస్ట్