సోంపేట మండలం సోంపేట పంచాయతీలో సోమవారం ఎస్సీ, ఎస్టీ బాలికల హాస్టల్‌లో పర్యావరణం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. హాస్టల్ పరిసరాలను శుభ్రంగా ఉంచాల్సిన అవసరాన్ని అధికారులు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సిహెచ్.ఈశ్వరమ్మ, డిప్యూటీ ఎంపీడీవో జి.భాస్కరరావు పాల్గొన్నారు. విద్యార్థుల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారని వారు తెలిపారు.