సోంపేట మండలం పాలవలస గ్రామంలో శుక్రవారం కొత్తగా మంజూరైన 14 వృద్ధాప్య, వితంతు పింఛన్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మాజీ జెడ్పీటీసీ సూరాడ చంద్రమోహన్, స్థానిక నాయకులు టిడిపి కార్యాలయంలో నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్‌లు అందజేశారు.