సోంపేట మండలం కొర్రాయిపేట గ్రామానికి చెందిన ఎస్ జీవన్ తన చివరి ప్రయత్నం లో కానిస్టేబుల్ గా విజయం సాధించాడు. శుక్రవారం విడుదలైన ఫలితాలలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా తాను ఎంపిక అయ్యానని జీవన్ తెలిపాడు. తనకు 32 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయని అయితే చివర ప్రయత్నంలో తాను విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. తన తండ్రి లేకపోయినా తల్లి నరసమ్మ వ్యవసాయ కూలీ పనులు చేస్తూ తనను చదివించారని వివరించారు.