సోంపేట మండలం పల్లె గొల్లగండిలో శుక్రవారం "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు పాల్గొని విద్యార్థులకు గొడుగులు పంపిణీ చేశారు. అనంతరం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై వివరించారు. స్థానికుల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.