సోంపేట బీల భూమిలో థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో దానిని వ్యతిరేకించిన స్థానికులపై పోలీసుల కాల్పులలో ముగ్గురు అమర మరణం పొందారని ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు తెలిపారు. సోమవారం అమరవీరుల స్తూపం వద్ద ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి తో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కథన జరిగి నేటికీ సరిగ్గా 15 సంవత్సరాలు అయిందని వివరించారు. కార్యక్రమంలో పలువురు పోరాట సంఘాల నాయకులు పాల్గొన్నారు.