శ్రీకాకుళం: ఉమా రుద్ర కోటేశ్వర ఆలయ డోలోత్సవం

శ్రీకాకుళం గుడివీధిలోని శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం డోలోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు. రిక్షా స్టాండ్ వద్ద ప్రధాన అర్చకులు ఆరవిల్లి శ్రీరామమూర్తి శర్మ, చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో కామ దహనం నిర్వహించారు. ఈ వేడుకలో ఆలయ ఈఓ సుకన్య, పాలక మండలి సభ్యులు శివరామరాజుతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్