నీటి సంరక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు నీటి సంఘాల అధ్యక్షులు తరలింపు

అమరావతి పెరేడ్ గ్రౌండ్స్‌లో నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బుధవారం జరుగుతున్న నీటి సంరక్షణ - భద్రత- భవిష్యత్, సాగు నీటి సంఘాల పాత్ర కార్యక్రమానికి మన ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి తరలి వెళ్తున్న నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదిటి ఈశ్వరరావు రణస్థలం మండలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి సురేష్, పిన్నింటి బానోజీ నాయుడు, గొర్లె సాయి సందీప్ నాయుడు, బాలి శ్రీనివాసరావు, కోరాడ వెంకటరమణ, సుంకర ధనుంజయ్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్