శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలో కంచిలి మండలం జలంత్రకోట జంక్షన్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయి (27) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో, వెనుక వస్తున్న లారీ అతని తలపై నుంచి దూసుకుపోవడంతో ఈ ఘోరం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేశారు. మృతుడు కంచిలి మండలం గోకర్ణపురానికి చెందినవాడిగా గుర్తించారు.