ఎచ్చెర్ల మండలం మూసవాని పేట సముద్ర తీర ప్రాంతానికి వచ్చిన బంగ్లాదేశ్ మత్స్యకారులను మెరైన్ సీఐ బి ప్రసాద్ రావు అదుపులోకి తీసుకున్న సంగతి విధితమే. వారు ప్రయాణిస్తున్న పడవ మరమ్మతులకు గురికావడంతో ఇక్కడికి చేరుకున్నారని సిఐ తెలిపారు. వీరిని సోమవారం రాత్రి నరసన్నపేట కోర్టులో హాజరుపరచగా సివిల్ జడ్జి ఎస్ వాణి 15 రోజులపాటు రిమాండ్ విధించారు. దీంతో వీరిని నరసన్నపేట సబ్ జైలుకు తరలించామని సిఐ పేర్కొన్నారు.