నరసన్నపేట: ప్రమాదపు అంచున పాఠశాల భవనం

నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రమాద భరితంగా శిథిల భవనం దర్శనమిస్తోంది. గతంలో ఈ భవన నిర్మాణం జూనియర్ కళాశాల కొనసాగిన సమయంలో ఈ భవనాలను నిర్మించారు. అయితే జూనియర్ కళాశాల వేరే ప్రాంగణానికి వెళ్లిపోవడంతో ఈ భవనం వృధాగా మిగిలిపోయింది. ఇక్కడ ఉన్న మూడు గదులు వినియోగించకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. శిథిల భవనంపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్