నరసన్నపేటలో కమ్ముకున్న పొగ మంచు.. స్థానికుల అవస్థలు

నరసన్నపేట పట్టణంలో శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. తెల్లవారుజాము నుండి కురుస్తున్న మంచుతో రైతులు, సాధారణ ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారిలో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, భారీ వాహనాల డ్రైవర్లు ఫ్లడ్ లైట్ల వెలుతురులో ప్రయాణించాల్సి వచ్చింది. ఈ పొగమంచు ఈ నెలంతా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.

సంబంధిత పోస్ట్