జి. సిగడాం: శనీశ్వర ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ఈశ్వర్ రావు

గంగు వారి సిగడాం మండలం డి ఆర్ వలస గ్రామంలో రెండు రోజుల క్రితం శనీశ్వరుని ఆలయంలో విగ్రహాలు ధ్వంసం పట్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఏ మేరకు సోమవారం ఆలయాన్ని ఆయన సందర్శించారు. మత భావాలను రెచ్చగొట్టే దిశగా ప్రయత్నిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన స్పష్టం చేశారు. దుండగులపై చర్యలు తప్పవన్నారు. ఆయనతోపాటు ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్