గొట్టిపల్లి: దుర్గమ్మ ఆలయంలో దొంగలు హల్‌ చల్

నరసన్నపేట మండలం గొట్టిపల్లిలోని శ్రీ దుర్గమ్మ ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఆదివారం ఉదయం అర్చకులు ఆలయానికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటంతో గ్రామస్థులకు సమాచారం అందించారు. టీడీపీ నాయకుడు కుమార్, స్థానికుల ఫిర్యాదుతో ఎస్సై శేఖర్ రావు సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనలో 5 శతమానాలు, హుండీ దొంగిలించబడినట్లు గుర్తించి, పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్