వాతావరణంలో వచ్చిన మార్పులతో ఒక్కసారిగా వర్షాలు పడుతుండడంతో రైతులు గుండెల్లో అలజడి మొదలైంది. పొలాలలోని వరి కోతలు నిర్వహించి ధాన్యాన్ని బస్తాల్లో నిలువచేసి ఉంచడంతో సోమవారం ఉదయం నుండి పడుతున్న వర్షాలకు రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ముందస్తు చర్యలు తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని దీంతో ధాన్యం తడిచిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.