తామరాపల్లి గ్రామంలో వ్యాస(గురు)పౌర్ణమి పురస్కరించుకొని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం వద్ద ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి స్వామివారికి అభిషేకం, అనంతరం అలంకరణ, షోడశపచారాలు, అష్టోత్తర శతనామావళితో పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు దార్లపూడి సర్వేశ్వర శర్మ, సాయి మనోజ్ శర్మ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.