నరసన్నపేటలో భారీ వర్షం.. జలమయమైన రహదారులు

నరసన్నపేటలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 9 గంటలకు మొదలై 11 గంటల వరకు కొనసాగిన ఈ వర్షం కారణంగా పలు రహదారులు జలమయమయ్యాయి. అండర్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో నీరు నిలిచిపోయిందని, పల్లపు ప్రాంతాల్లోని ఇళ్లలోకి కూడా నీరు చేరిందని స్థానికులు తెలిపారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్