నరసన్నపేట సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో శనివారం సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ కన్వీనర్ బగ్గు అర్చన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థినిలు భోగి మంటలు, హరిదాసుల వేషధారణతో అలరించారు. సంక్షేమ అధికారిని సూర్యప్రభ పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకల్లో, వసతి గృహ ప్రాంగణంలో విద్యార్థినిలు వేసిన రంగవల్లులను అర్చన ప్రశంసించారు.