జలుమూరు: పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించండి

ఈ ఏడాది విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా నేటి నుండే కసరత్తు ప్రారంభించాలని ఎంఈఓలు బమ్మిడి మాధవరావు, ఎం వరప్రసాదరావు తెలిపారు. గురువారం జలుమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్థానిక ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ మెరుగైన బోధన అందించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో హెచ్ఎం వేణుగోపాలరావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్