జలుమూరు: అల్లాడ పిఎసిఎస్ అధ్యక్షుడిగా చంద్రభూషణం

జలుమూరు మండలం అల్లాడ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులుగా వెలమల చంద్రభూషణ్ పదవి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం జరిగిన కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని ఆదేశించారు. రైతు సమస్యలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక టిడిపి శ్రేణులతో పాటు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్