జలుమూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించిన ఎంఈఓ బమ్మిడి మాధవరావు, విద్యార్థుల వర్క్ బుక్కులను పరిశీలించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఇస్తున్న వర్క్ బుక్కులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, హోంవర్క్ లు కూడా పూర్తిచేసి మరుసటి రోజు ఉపాధ్యాయులకు చూపించాలని, తప్పులుంటే సూచనలు అందిపుచ్చుకోవాలని ఆయన తెలిపారు.