జలుమూరు మండలం శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఉదయం హుండీలను తెరిచి లెక్కింపు చేపట్టారు. ఆలయ ఈవో కొండలరావు తెలిపిన వివరాల ప్రకారం, 71 రోజులకు గాను మూడు లక్షల 11వేల 196 రూపాయల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ లెక్కింపు సత్యసాయి సేవాసమితి సభ్యులు, స్థానిక పోలీసులు, మందస దేవాలయ కార్య నిర్వహణ అధికారి ఎస్ నాగేశ్వరరావు సమక్షంలో జరిగింది.