జలుమూరు మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా జడ్పిటిసి మెండ విజయశాంతి దివ్యాంగ చిన్నారులకు అన్ని విధాల అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా దివ్యాంగులకు అండగా ఉంటుందని ఉపాధ్యాయుడు రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు, తహసిల్దార్ జె. రామారావు తదితరులు పాల్గొన్నారు.