జలుమూరు: రేపు తిలారు జంక్షన్ లో ఉచిత న్యాయ సహాయ శిబిరం

గరీబ్ గైడ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భార్గవి ఆదివారం మాట్లాడుతూ, జలుమూరు మండలం తిలారు జంక్షన్లో ఈనెల 27వ తేదీన ఉచిత న్యాయ సహాయ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామాన్యులకు న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించే ఈ శిబిరం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని, సుప్రీంకోర్టు న్యాయవాది డివి రావు పాల్గొంటారని ఆమె వివరించారు.

సంబంధిత పోస్ట్