జలుమూరు: ప్రైవేట్ కన్నా ప్రభుత్వ పాఠశాలలు మేలు

జలుమూరు ప్రభుత్వ మోడల్ ఆదర్శ పాఠశాల ఆధ్వర్యంలో అడ్మిషన్ల ప్రక్రియను ముమ్మరం చేశారు. పాఠశాల పనివేళల అనంతరం హెచ్ఎం మాధవరావు, ఉపాధ్యాయుడు మెండ రామారావుతో పాటు ఇతర ఉపాధ్యాయులు స్థానిక గ్రామాల్లో పర్యటించి, విద్యార్థుల తల్లిదండ్రులను కలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరిస్తూ, వాటిని పరిరక్షించుకోవాలని సూచించారు. ఈ సందర్శన బుధవారం జరిగింది.

సంబంధిత పోస్ట్