జలుమూరు: శ్రీముఖలింగం లో భక్తిశ్రద్ధలతో కామ దహనం నిర్వహణ

జలుమూరు మండలం శ్రీముఖలింగం లోని శ్రీముఖలింగేశ్వరుని సన్నిధిలో మంగళవారం రాత్రి కామ దహనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను తిరువీధి నిర్వహించి, అనంతరం కామ దహనం చేసినట్లు అర్చకులు బంకుపల్లి భూషణ శర్మ తెలిపారు. ఉత్సవ విగ్రహాలను ఆలయానికి తరలించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్