జలుమూరు మండలం తిమడాం గ్రామంలోని శ్రీ సీతారామ దేవస్థాన ప్రాంగణంలో నిర్వహిస్తున్న భాగవత సప్తాహం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద, ఆధ్యాత్మిక చింతనతోనే ప్రతి ఒక్కరిలో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగిన సప్తాహం, భీష్మ ఏకాదశి రోజున ప్రత్యేక యాగంతో ముగిసింది.